Thursday, April 18, 2024
Homeతెలంగాణఆస్తుల కోసమే బిజెపిలోకి ఈటెల : కడియం

ఆస్తుల కోసమే బిజెపిలోకి ఈటెల : కడియం

రాజకీయ మనుగడ కోసం, కేసుల నుండి తప్పించుకోవడానికి, ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఈటెల రాజేందర్ బిజెపిలో చేరారని మాజీ డిప్యుటీ సిఎం కడియం శ్రీహరి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా నష్టం చేసిన బీజేపీలో ఈటెల రాజేందర్ ఎలా చేరారని నిలదీసిన కడియం….బీజేపీలో ఈటెల రాజేందర్ కు సముచిత గౌరవం దక్కేలా లేదని అభిప్రాయపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో బీజేపీలో చేరుతాడని అనుకున్నామని, కానీ అది జరగలేదని వ్యాఖ్యానించారు.

ఈటెల రాజేందర్ లోని కమ్యూనిస్టు ఎమయ్యాడని, అయన సిద్ధాంతాలు, భావజాలం, వామపక్ష లక్షణాలు ఎక్కడికి పోయాయని కడియం ప్రశ్నించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఉంటే అయినా రాజేందర్ కు కొంతలో కొంత గౌరవం ఉండేదని, హుజురాబాద్ ప్రజలు ఆశీర్వదించి ఉండేవారు కావొచ్చని, కానీ బీజేపీ లో చేరడంతో ఆయన పైన నమ్మకం పోయిందని ఎద్దేవా చేశారు.

వాస్తవానికి ఈటెల రాజేందర్ వే రాచరికపు, ఫ్యూడల్ భావాలని, వందలాది ఎకరాల భూములు, కోట్లాది రూపాయల ఆస్తులు ఆయనకు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

పోరాటం చేయకుండా పారిపోయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఈటెల చేరారని, బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ అని, కులాల వారిగా, మతాల వారీగా జాతిని విభజించే పార్టీ అని ఈటెల కు తెలియదా ని కడియం సూటిగా అడిగారు.

వెస్ట్ బెంగాల్ లాగా తెలంగాణలో బిజెపి నేతలు కుట్రలు చేస్తున్నారని, తృణమూల్ పార్టీలో చిచ్చు పెట్టె ప్రయత్నం చేసి విఫలమయ్యారని, అలాగే తెలంగాణలోను అస్థిరత్వం తీసుకొచ్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఇక్కడ అలాంటి ఆటలు సాగబోవని కడియం హెచ్చరించారు. తెలంగాణాలో బీజేపీ కి క్యాడర్ లేదని, గ్రామ స్థాయి లో నిర్మాణం లేదని, ప్రజల ఆదరణ టిఆర్ఎస్ పార్టీకే ఉందని కడియం స్పష్టం చేశారు.

తెలంగాణ రాజకీయాలను తట్టుకునే బహుబలి కేసీఆర్ మాత్రమేనని, ప్రజలకు ఆయనపైనే అపార నమకం ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయ ల్లో వేరే వారికి స్థానం లేదన్న కడియం కేసీఆర్ మాత్రమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని, కేసీఆర్ ని మాత్రనే బలపర్చాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్