Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్Australian Open-2023: సింధు, శ్రీకాంత్ విజయం- సేన్ రిటైర్డ్

Australian Open-2023: సింధు, శ్రీకాంత్ విజయం- సేన్ రిటైర్డ్

సిడ్నీలో మొదలైన బ్యాడ్మింటన్ ఆస్ట్రేలియన్ ఓపెన్-2023లో భారత స్టార్ ఆటగాళ్ళు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్రణయ్ లు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు.

పురుషుల సింగిల్స్ లో

  • కిడాంబి శ్రీకాంత్ 21-8; 21-17తో జపాన్ ప్లేయర్ కింతా నిశిమోతో పై
  • మిథున్ మంజునాథ్ 21-19;21-19 తో సింగపూర్ ఆటగాటు లో కీన్ యెవ్ పై
  • హెచ్ ఎస్ ప్రణయ్ 21-18; 16-21; 21-15తో హాంగ్ కాంగ్ ఆటగాడు లీ చ్యోక్ యు పై
  • ప్రియాన్షు రాజావత్ 21-12;21-16 తో ఆస్ట్రేలియా ప్లేయర్ నాథన్ తాంగ్ పై గెలుపొందాడు.
  • మరో మ్యాచ్ లో మన దేశానికేచెందిన స్టార్ లక్ష్య సేన్ – కిరణ్ జార్జ్ మధ్య మొదలైన పోరులో జార్జ్ 5-0 ఆధిక్యంలో ఉన్న సమయంలో సేన్ కు గాయం కావడంతో రిటైర్ అయ్యాడు. దీనితో జార్జ్ గెలుపొందాడు.

మహిళల సింగిల్స్ లో

  • పివి సింధు 21-18;21-13 తో మన దేశానికే చెందిన అస్మిత చిల్లర పై;
  • ఆకర్షి కాశ్యప్ 21-15;21-17తో ఆసీస్ ప్లేయర్ గొ జిన్ వీ పై గెలుపొందారు.

కాగా, మాళవిక  బన్సోద్, తస్లీంమీర్, సుమీత్ రెడ్డి- అశ్విని పొన్నప్ప జోడీ; రోహన్ కపూర్- సిక్కీ రెడ్డి జోడీ లు తమ ప్రత్యర్థులపై ఓటమి పాలై నిష్క్రమించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్