Saturday, January 18, 2025
HomeTrending Newsఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు సిలోన్ ప్రణాలికలు

ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు సిలోన్ ప్రణాలికలు

ఆర్థిక చిక్కుల నుంచి బయటపడేందుకు సిలోన్ పాలకులు మార్గాలు వెతుకుతున్నారు. విధానపరమైన నిర్ణయాల్లో పాలకులు దేశ ప్రయోజనాలే లక్ష్యంగా.. ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేసేట్టు ప్రణాలికలు సిద్దం చేస్తున్నారు. శ్రీలంక గతంలో ఎన్నడూలేని విధంగా ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నది. అప్పుల ఊభిలో కూరుకుపోయిన లంక.. గట్టెక్కేందుకు చర్యలు తీసుకుంటున్నది. తాజాగా అప్పుల భారాన్ని ఎదుర్కొంటున్న దేశానికి చెందిన ఎంపీలకు ఆర్థిక, వ్యాపారానికి సంబంధించిన విషయాలపై నిర్ణయాలు తీసుకునేలా అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎకనామిక్ అండ్ ట్రేడ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని శ్రీలంక సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇన్‌స్టిట్యూట్‌ లక్ష్యం పార్లమెంటేరియన్లు, అధికారులకు ఆర్థిక, వ్యాపార విషయాలపై సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడడమేనని చెప్పారు.

ఆర్థిక అంశాలపై శిక్షణ కార్యక్రమం అంశాన్ని క్యాబినేట్‌ అధికార ప్రతినిధి బందుల గుణవర్ధనే అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముసాయిదా బిల్లును లీగల్ డ్రాఫ్ట్స్‌మెన్ రూపొందిస్తారన్నారు. ఇదిలా ఉండగా.. విదేశామారక నిల్వలు తగ్గడంతో ఏడాది ప్రారంభం నుంచి సంక్షోభంతో అల్లాడుతున్నది. ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయికి చేరగా ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది. దీంతో ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబావుటా ఎగురవేయడంతో ప్రభుత్వం సైతం మారిపోయింది. అనేక వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చినా.. పొంచి ఉన్న సంక్షోభం గురించి చట్టసభ్యులకు సరైన సమాచారం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సరైన నిర్ణయాలు తీసుకున్న పక్షంలో సంక్షోభాన్ని నివారించవచ్చని చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్