Saturday, November 23, 2024
HomeTrending Newsశ్రీలంకలో చల్లారని ఆందోళనలు

శ్రీలంకలో చల్లారని ఆందోళనలు

శ్రీలంకలో ఆందోళనలు చల్లారటం లేదు. వంట గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రెండు నెలలుగా LPG గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మహిళలు ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసన బాట పట్టారు. రాజపక్స కుటుంబానికి వ్యతిరేకంగా కొలంబోలో జరుగుతున్న ఆందోళనలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇస్తున్నారు. రాజపక్స కుటుంబం ప్రభుత్వం నుంచి వెలుపలికి వస్తేనే దేశ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆందోళనకారులు అంటున్నారు.

మరోవైపు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న ప్రజలపైన తన మద్దతు దారులతో దాడులు చేయించి, ప్రజల ప్రాణాలు బలిగొన్న మాజీ ప్రధానమంత్రి మహింద రాజపక్సను వెంటనే అరెస్టు చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని శ్రీలంక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు అయింది. రాజపక్సను వ్యతిరేకిస్తున్న వారిని దేశద్రోహులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని… ఈ కుట్రకు కారణమైన రాజపక్స కుటుంబ సభ్యులను అరెస్టు చేయాలని పిటిషన్ లో కోరారు.

సిలోన్ నెలకొన్న ఆందోళనల దృష్ట్యా ఆ దేశానికి వెళ్ళకూడదని అమెరికా ప్రభుత్వం అమెరికన్ పౌరులకు స్పష్టం చేసింది. అత్యవసరమైన అమెరికా విదేశాంగ శాఖ అనుమతితో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాజపక్స కుటుంబం ప్రభుత్వం నుంచి వైదోలగక పోతే అంతర్యుద్దానికి దారి తీసే ప్రమాదముందని అమెరికా, యురోపియన్ దేశాలు అనుమానిస్తున్నాయి. కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘేకు రాజపక్స కుటుంబం నుంచి సహకారం అందకపోతే శ్రీలంక సంక్షోభం నుంచి బయట పడే అవకాశం లేదని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి.

Also Read : ఇండియాతో స్నేహం అత్యావశ్యకం – విక్రమసింఘె 

RELATED ARTICLES

Most Popular

న్యూస్