Sunday, March 15, 2026
Homeసినిమానాగ చైతన్య-వెంకట్ ప్రభు ద్విభాషా చిత్రం

నాగ చైతన్య-వెంకట్ ప్రభు ద్విభాషా చిత్రం

Cinema Confirmed: మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్‌హిట్‌ లను అందుకున్న‌ నాగ చైతన్య ‘థాంక్యూ‘ చిత్రం విడుదలకు సిద్ధం గా ఉంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైతన్య 22వ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందనుంది. నావెల్ కంటెంట్‌తో పాటు స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వెంక‌ట్ ప్ర‌భు త‌న ‘మానాడు’తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు.

రామ్ నటిస్తున్న ‘వారియర్’ బోయపాటి శ్రీను – రామ్ కాంబినేష‌న్‌ చిత్రంతో సహా కొన్ని సెన్సేష‌న‌ల్ ప్రాజెక్ట్‌ లను చేయ‌బోతున్న ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్‌ లో నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ప‌వన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు. తెలుగు, త‌మిళ భాషల్లో ఏకాకాలంలో రూపొంద‌బోతున్న ఈ చిత్రాన్ని హైటెక్నిక‌ల్ స్టాండర్డ్స్ తో భారీ బడ్జెట్ లో నిర్మించనున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా రూపొందించ‌నున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, మ‌రియు అనుభ‌జ్ఞులైన‌ సాంకేతిక నిపుణులు ప‌ని చేయనున్నారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Also Read : అక్కినేని నాగ‌చైత‌న్య ‘థాంక్యూ’ చిత్రీకరణ పూర్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular