Sunday, January 19, 2025
HomeTrending Newsఇదో సువర్ణ అధ్యాయం: శ్రీనివాస గౌడ్

ఇదో సువర్ణ అధ్యాయం: శ్రీనివాస గౌడ్

Great Achievement: నీరా దాని అనుబంధ ఉత్పత్తుల తయారీకి ప్రతిష్టాత్మక FSSAI లైసెన్సు సాధించటం రాష్ట్ర నీరా చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల మంత్రి వి. శ్రీనివాస గౌడ్ అభివర్ణించారు.   గీత వృత్తిదారుల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీరా పాలసీలో ఇది అతి ముఖ్యమైన ఘట్టమని పేర్కొన్నారు. FSSAI లైసెన్సు ను అధికారులు మంత్రికి అందజేశారు.

ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ తెలంగాణ  ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రకృతి సిద్ధమైన నీరా, కల్లులను ద్రవ పదార్ధాలుగా గుర్తించి నీరా పాలసీని ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గీత కార్మికులు మాత్రమే ఉత్పత్తి చేసేందుకు, అమ్ముకునే విధంగా నీరా పాలసీ ని ప్రవేశపెట్టారని చెప్పారు. దీనిలో భాగంగా హైదరాబాద్ నగరంలో ఎంతో విలువైన నెక్లెస్ రోడ్ లో సుమారు 10 కోట్ల రూపాయల తో నీరా కేఫ్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

నేడు Food Safety and Standard Authority of India (FSSAI) లైసెన్సు సాధించటం గొప్ప అదృష్టమని మంత్రి శ్రీనివాస గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతి జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో నీరా కేఫ్ లను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టూరిజం MD మనోహర్, అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు దత్తరాజ్ గౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్