Wednesday, June 26, 2024
Homeసినిమాపుష్ప ‘శ్రీ వల్లి’ లిరికల్ సాంగ్ కు అద్భుత స్పందన

పుష్ప ‘శ్రీ వల్లి’ లిరికల్ సాంగ్ కు అద్భుత స్పందన

“నిను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే..
నీ చూపుల పైనే రెప్పలు వేసి కప్పేస్తావే”
అంటూ సాగే పుష్ప లిరికల్ సాంగ్ విడుదలైంది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న మూవీ పుష్ప. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్’ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. తాజాగా రష్మిక మందన్న శ్రీవల్లి పాట విడుదల చేశారు మేకర్స్. రష్మిక మందన్నపై చిత్రీకరించిన శ్రీవల్లి పాటకు అనూహ్య స్పందన వస్తుంది. సాహితీ చిచ్చ‌ర‌ పిడుగు చంద్ర‌బోస్ రాసిన ఈ పాట‌ను సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. డిసెంబ‌ర్ 17న పుష్ప చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్