Thursday, January 23, 2025
Homeసినిమాపవన్ కళ్యాణ్ , సురేందర్ రెడ్డి మూవీ అనౌన్స్

పవన్ కళ్యాణ్ , సురేందర్ రెడ్డి మూవీ అనౌన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తను చేస్తున్న, చేయబోతున్న సినిమాల అప్ డేట్స్ అందించి అభిమానులకు ఎనలేని ఆనందాన్ని అందించారు. ‘భీమ్లా నాయక్’ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాతో పాటు చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ ను 2022 ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్టుగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. వీటితో పాటు హరీష్ శంకర్ తో చేస్తున్న మూవీకి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ అప్ డేట్స్ తో పాటు స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ చేయనున్న సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు. యువ నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాపై అధికారిక ప్రకటన విడుదల చేస్తూ పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసింది. ప్రచార చిత్రాన్ని గమనిస్తే .. ఓ వైపు తుపాకి, “యధా కాలమ్.. తధా వ్యవహారం’ అన్న పదాలు కనిపిస్తాయి. నగర వాతావరణం కనిపిస్తోంది. తమ బ్యానర్ నుంచి 9 వ చిత్రంగా ప్రకటించిన దీనికి వక్కంతం వంశీ రచయిత. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్