Saturday, January 18, 2025
Homeసినిమాపవన్ కోసం తమన్ ఫోక్ సాంగ్

పవన్ కోసం తమన్ ఫోక్ సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దగ్గుబాటి రానా కాంబినేషన్ లో ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందిస్తుండడం విశేషం. పవన్ కళ్యాణ్ కి కరోనా రావడం.. ఆ తర్వాత లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేయడంతో తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్త సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్న ఎస్ఎస్ తమన్ ఓ ఫోక్ సాంగ్‌ను ప్రత్యేకంగా కంపోజ్ చేస్తున్నార‌ట‌. ఈ సాంగ్ సినిమా సెకండాఫ్‌లో రానుంద‌ని తెలిసింది మరో విషయం ఏంటంటే… ఈ పాట‌ను పెంచ‌ల‌దాస్ ఆల‌పిస్తార‌ని తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదల ఎప్పుడు అనేది త్వరలో ప్రకటిస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్