Thursday, March 28, 2024
HomeTrending Newsచరిత్ర సృష్టించిన న్యూ జిలాండ్

చరిత్ర సృష్టించిన న్యూ జిలాండ్

న్యూజిలాండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్ట్ ఛాంపియన్ హోదాను సగర్వంగా సంపాదించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూ.టి.సి.) ఫైనల్ లో ఇండియాపై ఘన విజయం సాధించి ఐసిసి నిర్వహిస్తున్న టెస్ట్ ఛాంపియన్స్ టైటిల్ తొలి విజేతగా అవతరించింది. 2000 సంవత్సరంలో జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ మినహా మరే ఇతర అంతర్జాతీయ ట్రోఫీలు గెలవని న్యూజిలాండ్ ఈసారి గొప్ప చరిత్రను తన పేరిట లిఖించుకుంది. రెండో ఇన్నింగ్స్ లో  53 ఓవర్లలో 139 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన  న్యూజిలాండ్  కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 45.5 (43 బంతులు మిగిలి ఉండగానే)  ఓవర్లలోనే విజయం సాధించింది. కెప్టెన్ విలియమ్సన్ 52,  రాస్ టేలర్ 47 పరుగులతోను నాటౌట్ గా ఉన్నారు.

ఐసిసి గతంలో 2013, 2017 సంవత్సరాల్లో ఈ టోర్నీ నిర్వహించాలనుకున్నా అది సాధ్యపడలేదు. ఎట్టకేలకు 2019లో  మొదలైన ఈ టైటిల్ పోరులో మొత్తం 9 దేశాలు ఈ పోరులో ఆడేందుకు అర్హత సంపాదించాయి. కరోనా కారణంగా కొన్ని మ్యాచ్ లు రద్దయ్యాయి, దీంతో మెరుగైన రన్ రేట్ తో పాటు పాయిట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్ చేరుకున్నాయి. ఈసారి పట్టుదలతో, కరోనా నేపధ్యంలో కూడా తను అనుకున్నది సాధించింది ఐసిసి.  ఇది తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ పోరు కావడం విశేషం, ఇకపై ప్రతి రెండేళ్లకోసారి ఈ ఛాంపియన్ షిప్ ను ఐసిసి నిర్వహించనుంది. ఆగస్టులో మొదలయ్యే ఈ మెగా టోర్నీ ఆ తర్వాత రెండో ఏడాది జూలై నాటికి ముగుస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్