Saturday, February 22, 2025
HomeTrending Newsవైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట

వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట

కొత్త సంవత్సరం వేళ విషాదం నెలకొంది. జమ్మూ కశ్మీర్‌లోని రెసి జిల్లా కట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 12మంది భక్తులు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయంలో పూజల కోసం భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స కోసం అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌‌కు చెందిన భక్తులున్నట్టు గుర్తించారు. శనివారం తెల్లవారుజామున 2.45గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

ఆలయం వెలుపల త్రికూట కొండపై తొక్కిసలాట చోటుచేసుకుంది. తొలుత భక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తొక్కిసలాటకు దారితీసిందని  జమ్ముకశ్మీర్  డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. ‘కట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.. మరో 13 మంది గాయపడ్డారు. భక్తుల మధ్య వాగ్వాదం క్రమంగా పెరిగి ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లి తొక్కిసలాటకు దారితీసింది’ అని పేర్కొన్నారు.

ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. తొక్కిసలాటలో 12 మంది మృతిచెందడంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ప్రధాని పరిహారం ప్రకటించారు.

మరోవైపు, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సైతం బాధితులకు పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్టు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు.

వైష్ణోదేవి ఆలయంలో సహాయం కోసం Phone No: 01991234804 & 01991234053 సంప్రదించవచ్చు.

రెసి జిల్లా యంత్రాంగం, కట్రా లో ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. కింది ఫోన్లలో అధికారులను సంప్రదించవచ్చు.

PCR Katra 01991-232010/ 9419145182, PCR Reasi 01991245076/ 9622856295; DC Reasi Control Room 01991-245763/ 9419839557

RELATED ARTICLES

Most Popular

న్యూస్