ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేసిన అప్పు గుట్టుగా చేయలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ప్రజలను మభ్యపెట్టేందుకే పీఏసీ ఛైర్మన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
అమ్మ ఒడి, ఆసరా, చేయూత పథకాల కోసమే అప్పు తీసుకున్నామని, జీవోల ప్రకారమే లోన్ తీసుకున్నామని, గుట్టుగా ఏమీ తీసుకోలేదని వెల్లడించారు. టీడీపీ హయాంలో వేల కోట్ల అప్పులు చేశారు.. అనుమతులు తీసుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
‘‘టీడీపీ హయాంలో 96 వేల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల అప్పులు చేశారు. ప్రభుత్వం మారింది.. మేం అప్పులు కడుతున్నామని’’ బుగ్గన వివరించారు. ఏపీకి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులు, కార్యదర్శులతో చర్చిస్తున్నామని, ఢిల్లీ పర్యటనలపై తప్పుడు ప్రచారం చేయొద్ధని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.