అక్టోబర్ -నవంబర్ లోనే హుజురాబాద్ ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో ఉప ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేయని రాష్ట్ర ప్రభుత్వాలు. వరదలు, పండుగలు, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఉప-ఎన్నికలు ఇప్పుడే వద్దన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 11 రాష్ట్రాలు. పండుగల సీజన్ తర్వాతే ఉప-ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి సూచించిన రాష్ట్రాలు.
ఈ నేపథ్యంలో అక్టోబర్ లో దసరా,దీపావళి తరువాతే హుజురాబాద్ ఉప ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 32 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో ఖాళీలు ఉన్నాయి. ఉప-ఎన్నికల నిర్వహణపై రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు కోరిన కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో ఉప ఎన్నికల నిర్వహణ పై తమ అభిప్రాయాలు ఈసీకి తెలియజేసిన రాష్ట్రాలు.
తమ రాష్ట్రంలో కరోనా పూర్తి నియంత్రణలో ఉందని ,వరదలు అడ్డంకి కావని ఈసీకి తెలిపిన ఒడిశా, పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీలు. ఉప ఎన్నికలకు నిర్వహణకు పూర్తి సంసిద్ధంగా ఉన్నామని తెలిపిన బెంగాల్,ఒడిశా రాష్ట్రాలు. ఉప ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేమని ఈసీకి తెలిపిన ఏపీ, తెలంగాణ, అసోం, బీహార్,హర్యానా,హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ,రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలి,డామన్ డయ్యు రాష్ట్ర ప్రభుత్వాలు.
బెంగాల్ లో మూడు ,ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానాలకి సెప్టెంబర్ 30న ఉపఎన్నిక జరగనుంది. అక్టోబర్ 3న ఫలితాలు వెలువడతాయి. బెంగాల్ లో భవానీపూర్, శంషేర్ గంజ్, జంగీపూర్ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలు. ఒడిశాలో పిప్లి స్థానానికి జరగనున్న ఉపఎన్నిక. పశ్చిమ బెంగాల్ లో భవానీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానం నుంచి మమతా బెనర్జీ ఓడిపోయారు.
కొద్దిరోజుల క్రితం ఢిల్లీ పర్యటనలో మమత బెనర్జీ ఉపఎన్నికల అంశాన్ని ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో ప్రస్తావించారు. ఉపఎన్నికలు నిర్వహించకపోతే సిఎం సీటు నుంచి మమత వైదొలగాల్సిన పరిస్థితి నెలకొంది. మమత స్థానంలో ఆమె బంధువు అభిషేక్ బెనర్జీని కూచోపెట్టేందుకు రంగం సిద్దమైంది. అదే జరిగితే రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందని కమలనాథులు అంచనాకు వచ్చారు. మమత కాళ్ళకు బలపం కట్టుకొని మరీ ప్రచారం చేస్తుందని, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని బిజెపి నేతలు ఉపఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రాజకీయ వర్ఘాల బోగట్టా.