Sunday, June 14, 2026
Homeసినిమానాగ్ మూవీ ఇంకా ఫిక్స్ కాలేదా..?

నాగ్ మూవీ ఇంకా ఫిక్స్ కాలేదా..?

నాగార్జున ఇటీవల కాలంలో చేసిన యాక్షన్ మూవీస్ ‘వైల్డ్ డాగ్’, ‘ది ఘోస్ట్’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. దసరాకి వచ్చిన ది ఘోస్ట్ మూవీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని గట్టి నమ్మకం పెట్టుకున్నారు కానీ.. బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. దీంతో నెక్ట్స్ మూవీ విషయంలో నాగార్జున చాలా కేర్ తీసకుంటున్నారు. ‘బంగార్రాజు’తో సక్సెస్ సాధించినప్పటికీ ది ఘోస్ట్ మూవీ బాగా ఇబ్బంది పెట్టడంతో ఎలాంటి సినిమా చేయాలని తెగ ఆలోచిస్తున్నారట. కొంత మంది రైటర్స్ తో కథాచర్చలు జరుపుతున్నారని తెలిసింది.

నాగార్జున లాంటి సీనియర్ హీరోకి కథల కొరత ఏర్పడటం అంటే చిత్రమే నిజంగా విచిత్రమే. ఎప్పుడూ కొత్త ప్రయోగాలు చేస్తూ వచ్చే నాగార్జున ఈ మధ్య కథల సెలక్షన్స్ లో రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు. అందుకే ఆ సినిమాల ఫలితాలు అలా ఉంటున్నాయి. నాగార్జున నెక్స్ట్ సినిమా ప్రసన్న కుమార్ తో చేస్తున్నట్టు తెలుస్తుంది. నాగార్జున మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. నాగ్ కూడా ప్రేక్షకులు తనని ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తీస్తేనే చూస్తున్నారని ఫిక్స్ అయ్యారు. ప్రసన్న కుమార్ సినిమా తర్వాత కూడా మరో రైటర్ కథతో నాగార్జున సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

ఎంటర్టైనర్ సినిమాలతోనే ఆడియన్స్ ని మెప్పించాలని ఫిక్స్ అయిన నాగ్ అలాంటి కథలతోనే రమ్మంటూ దర్శకులకు చెబుతున్నారట. ఈ మధ్య కాలంలోనే పదుల సంఖ్యలో కథలు విన్నట్టు తెలుస్తుంది. వాటిలో రెండు కథలు నాగార్జునకు బాగా నచ్చాయట. త్వరలో ఆ సినిమాల ఎనౌన్స్ మెంట్ వస్తుందని సమాచారం. అలాగే వేరే హీరోలతో మల్టీస్టారర్ కథలను కూడా నాగ్ కోరుతున్నట్టు తెలుస్తుంది. మరి… ఈసారి నాగ్ ఎలాంటి కథతో వస్తారో..? బాక్సాఫీస్ దగ్గర మెప్పిస్తారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular