Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్The Ashes:600 వికెట్ల క్లబ్ లో బ్రాడ్- ఆస్ట్రేలియా 299/8

The Ashes:600 వికెట్ల క్లబ్ లో బ్రాడ్- ఆస్ట్రేలియా 299/8

యాషెస్ సిరీస్ లోని నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ బౌలర్లు ఆసీస్ ను భారీ స్కోరు చేయకుండా  కట్టడి చేయగలిగారు. మాంచెస్టర్ లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 15 వద్ద  ఉస్మాన్ ఖవాజా (3) ఔటయ్యాడు. లబుషేన్-51; మిచెల్ మార్ష్-51; ట్రావిస్ హెడ్-48; స్టీవ్ స్మిత్-41; డేవిడ్ వార్నర్ -32 పరుగులు చేశారు. ఆట ముగిసే సమయానికి మిచెల్ స్టార్క్-23; కెప్టెన్ కమ్మిన్స్-3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

క్రిస్ ఓక్స్ నాలుగు వికెట్లు తీయగా, స్టువర్ట్ బ్రాడ్ 2; మార్క్ వుడ్, మోయిన్ అలీ చెరో వికెట్ సాధించారు. స్టువర్ట్ బ్రాడ్  600 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్ అయ్యాడు. ముత్తయ్య మురళీధరన్(800),  వార్న్ (708); అండర్సన్ (688); కుంబ్లే (619)ల తర్వాత బ్రాడ్ నిలిచాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్