Stylish Star Allu Arjun Doing An Experiment In Icon Movie Blind Person Role As Per Sources :
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ తర్వాత అల్లు అర్జున్ నటించనున్న సినిమా ఏంటి అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే.. అల్లు అర్జున్ ‘పుష్ప’ పార్ట్ 1 తర్వాత ‘ఐకాన్’ మూవీ చేస్తాడని నిర్మాత బన్నీ వాసు ఇటీవల ప్రకటించారు. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దిల్ రాజు ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.
అయితే.. ఈ సినిమాలో అల్లు అర్జున్ అంధుడిగా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ‘ఐకాన్’ మూవీ ట్యాగ్ లైన్ ‘కనపడుట లేదు’ గా ఉంది. అంధుడిగా అల్లు అర్జున్ అంటూ వస్తోన్న వార్తలు.. ‘కనపడుటలేదు’ అనే ట్యాగ్ లైన్ చూస్తుంటే.. అల్లు అర్జున్ అంధుడిగా నటించడం అనేది నిజమే అనిపిస్తుంది. కెరీర్ స్టార్ట్ చేసినప్పటినుంచి ఇప్పటి వరకు అల్లు అర్జున్ ప్రయోగాత్మక చిత్రాల్లో నటించలేదు. ఫస్ట్ టైమ్ ఓ ప్రయోగం చేస్తున్నాడని అంటున్నారు. మరి అల్లు అర్జున్ ప్రయోగం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
Also Read : రష్మిక చెబుతున్న ‘పుష్ప’ కబుర్లు ఏమిటో…