Saturday, April 20, 2024
Homeసినిమాభయపడ్డాం... కానీ : సుధీర్ బాబు

భయపడ్డాం… కానీ : సుధీర్ బాబు

నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’.  శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ నివాస్ ప్రధాన పాత్రల్లో నటించగా  మహేష్‌ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా గురువారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో నిర్వహించిన  సక్సెస్ ప్రెస్ మీట్ లో సుధీర్ బాబు మాట్లాడుతూ. “సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ‘హంట్’ స్టార్ట్ చేసినప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడ్డాం. ఫ్యాన్స్ కానీ, రెగ్యులర్ కంటెంట్ చూసే వాళ్ళు గానీ ఏమంటారో అనుకున్నాం. ప్రేక్షకులు అందరూ సెకండాఫ్ లో 30 మినిట్స్ ఎక్స్ ట్రార్డినరీ అని చెబుతున్నారు. శని, ఆది వారాలు అయితే కలెక్షన్స్ అనౌన్స్ చేస్తాం. సోషల్ మీడియాలో చాలా మంది సినిమాను అప్రిషియేట్ చేస్తూ పోస్టులు చేశారు. ఆడియన్స్ చాలా మంది మెసేజ్ లు చేశారు. వాళ్ళందరికీ థాంక్స్. ఇది డిఫరెంట్ ఫిల్మ్. ఒక్కటి చెబుతా… నేను అయితే రెగ్యులర్ సినిమాలు చేయను. ఇప్పటి వరకు చేసినవి అన్నీ డిఫరెంట్ సినిమాలే. ఈ సినిమా కూడా చాలా డిఫరెంట్ సినిమా. థియేటర్లలో సినిమా చూడండి” అని అన్నారు.

భరత్ మాట్లాడుతూ… ”తెలుగు ప్రేక్షకుల ముందుకు స్ట్రెయిట్ సినిమాతో రావడానికి కొన్నేళ్ళు టైమ్ తీసుకున్నా… మంచి సినిమా చేశా. సరైన సినిమా చేశా. కంటెంట్ సినిమాల కోసం చూసే ప్రేక్షకులకు సరైన చిత్రమిది. కమర్షియల్ వేల్యూస్ తో సినిమా తీశాం. మహేష్ కెరీర్ లో ఇదొక మంచి సినిమా. సుధీర్ బాబు కొత్తగా ట్రై చేశారు. ఈ సినిమాలో నేను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన భవ్య క్రియేషన్స్ సంస్థకు థాంక్స్” అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్