Thursday, June 11, 2026
Homeసినిమాసుధీర్ బాబు 'హంట్' టీజర్ విడుదల

సుధీర్ బాబు ‘హంట్’ టీజర్ విడుదల

అర్జున్‌లు ఇద్దరు ఉన్నారు! ఒకరు ‘ఎ’, మరొకరు ‘బి’ అనుకుంటే… అర్జున్ ‘ఎ’కి తెలిసిన మనుషులు, ఇన్సిడెంట్స్, పర్సనల్ లైఫ్ ఏదీ అర్జున్ ‘బి’కి తెలియదు. వేర్వేరు మనుషులు అన్నట్టు! అయితే… అర్జున్ ‘ఎ’కి తెలిసిన భాషలు, స్కిల్స్, పోలీస్ ట్రైనింగ్ అర్జున్ ‘బి’లో ఉన్నాయి. అర్జున్ ‘ఎ’గా ఉండటమే అర్జున్‌కు ఇష్టం! అతని కోరిక నెరవేరిందా? అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయినా కేసు ఏమిటి? అనేది ‘హంట్’ సినిమాలో చూడాలి.

సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘హంట్’. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రలు పోషించారు. నేపథ్యంలో రూపొందుతోన్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.

‘హంట్’ టీజర్ యాక్షన్ ప్యాక్డ్‌గా కట్ చేశారు. సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సుధీర్ బాబు నటనకు తోడు సిక్స్ ప్యాక్ కూడా ఆట్టుకునేలా ఉంది. ‘తను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రాసెస్‌లో ఎవరు ఎఫెక్ట్ అయినా… ఎంత ఎఫెక్ట్ అయినా… నన్ను ఎవరూ ఆపలేరు’ అని టీజర్ చివరలో సుధీర్ బాబు చెప్పే డైలాగ్ మరింత క్యూరియాసిటీ పెంచింది.
సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ సైతం ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తున్న చిత్రమిది. విడుదలైన కొన్ని క్షణాల్లో ‘హంట్’ టీజ‌ర్‌కు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

Also Read: సుధీర్ బాబు చిత్రానికి హంట్టై టిల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular