Sunday, January 19, 2025
Homeసినిమాప‌వ‌ర్ స్టార్.. యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారా?

ప‌వ‌ర్ స్టార్.. యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారా?

Another New Director: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేస్తూ.. అంద‌రికీ స‌ర్ ఫ్రైజ్ ఇచ్చారు. ‘వ‌కీల్ సాబ్’ త‌ర్వాత ‘భీమ్లా నాయ‌క్’ సినిమా చేశారు. ఇటీవ‌ల ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన భీమ్లా నాయ‌క్ రికార్డ్ క‌లెక్షన్స్ తో బాక్సాఫీస్ ద‌గ్గర బ్లాక్ బ‌స్టర్ గా నిలిచింది. ప్రస్తుతం విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్.. గ‌బ్బర్ సింగ్ డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్ డైరెక్షన్లో ‘భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ లో స్టార్ట్ కానుంది.

ఈ సినిమా తర్వాత వపన్ కళ్యాణ్ ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఆ దర్శకుడు మరెవరో కాదు సుధీర్ వర్మ అని స‌మాచారం. స్వామిరారా, దోచేయ్, కేశవ, కిరాక్ పార్టీ, రణరంగం లాంటి చిత్రాల్ని డైరెక్ట్ చేసిన సుధీర్ వర్మ.. ప్రస్తుతం రవితేజ హీరోగా ‘రావణాసుర’ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే.. పవర్ స్టార్ తో సినిమా చేయబోతున్నాడని టాలీవుడ్ లో టాక్ బ‌లంగా వినిపిస్తోంది. త‌మిళ్ లో విడుద‌లైన ‘వినోద‌య చిత్తం’ రీమేక్ లో ప‌వ‌ర్ స్టార్ న‌టించ‌నున్నారు. దీనికి త్రివిక్రమ్ తనదైన స్టైల్లో  స్ర్కీన్ ప్లే , డైలాగ్స్ అందించబోతున్నారని టాక్. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమేనా..?  కాదా..? అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్