Wednesday, June 17, 2026
Homeసినిమాసుడిగాలి సుధీర్ కి ఈ సారైనా హిట్ పడేనా?!

సుడిగాలి సుధీర్ కి ఈ సారైనా హిట్ పడేనా?!

సుడిగాలి సుధీర్ సినిమాల్లోకి వచ్చి పదేళ్లు అయింది. చాలా సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపిస్తూ వచ్చాడు. ఆ తరువాత ‘జబర్దస్త్’ కామెడీ షోతో బాగా పాప్యులర్ అవుతూ వచ్చాడు. ఈ కామెడీ షోలో సుధీర్ స్కిట్స్ ప్రత్యేకంగా కనిపించేవి. ఇక మిగతా టీవీ ఛానల్స్ లోను .. మిగతా షోస్ లో ఆయన సందడి చేయడం మొదలుపెట్టాడు. సుధీర్ బాగా నవ్విస్తాడు .. అంతేకాదు మంచి డాన్సర్ కూడా. ఇక ఆయన డైలాగ్ డెలివరీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది.

బుల్లితెరపై సుధీర్ కి గల క్రేజ్ ను చూసే హీరోగా అవకాశాలు వెతుక్కుంటూ రావడం మొదలైంది. చిన్న సినిమాలే అయినా, ఒకదాని తరువాత ఒకటిగా చేస్తూనే వెళుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన నుంచి ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ .. ‘త్రీ మంకీస్’ .. ‘వాంటెడ్ పండుగాడ్’ .. ‘గాలోడు’ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కామెడీ వైపు నుంచే తనకి మంచి క్రేజ్ వచ్చిందనే విషయాన్ని సుధీర్ మరిచిపోలేదు. అందువల్లనే తన సినిమాల్లో కామెడీ మిస్సవ్వకుండా చూసుకుంటూ వచ్చాడు.

ఆయన తాజా చిత్రంగా ఇప్పుడు థియేటర్స్ కి రావడానికి ‘కాలింగ్ సహస్ర’ సిద్ధమవుతోంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ ఆసక్తిని పెంచేవిలానే ఉన్నాయి. అరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, డాలిశ్య అనే కొత్త అమ్మాయి సుధీర్  జోడీకడుతోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. హీరోగా వరుస ఫ్లాపులతో ఉన్న సుధీర్ ను ఈ సినిమా ఎంతవరకూ కాపాడుతుందనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular