Monday, June 29, 2026
Homeసినిమా'పీఎస్ 1'దిల్ రాజు బేబీ: సుహాసిని

‘పీఎస్ 1’దిల్ రాజు బేబీ: సుహాసిని

భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల్లో ఒక‌రు మ‌ణిర‌త్నం. బాహుబ‌లి సినిమా ఇచ్చిన స్పూర్తితో మ‌ణిర‌త్నం పొన్నియిన్ సెల్వ‌న్.. తెలుగులో పీఎస్ 1 టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో విక్రమ్, కార్తి, జ‌యం ర‌వి, ఐశ్వ‌ర్య‌రాయ్, త్రిష‌.. ఇలా భారీ తారాగ‌ణం ఉంది. ఎప్ప‌టి నుంచో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా ఈనెల 30న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది.

అయితే.. తెలుగులో ఈ సినిమాకి అంత‌గా బ‌జ్ క్రియేట్ అవ్వ‌లేదు. దీంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైద‌రాబాద్ లో నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ లో క‌థానాయిక‌ సుహాసిని మాట్లాడుతూ  “నేను ఇండీస్ట్రీకి వచ్చి  42 ఏళ్లు అయింది. ఇంత కాలంగా నాపై చూపిస్తూ వచ్చిన ప్రేమ .. ఈ సినిమా పై చూపించండి. అదే నా కోరిక అన్నారు. అంతే కాకుండా… పెళ్లికి ముందే మణి గారు ఈ కథకి సంబంధించిన 5 బుక్స్ ఇచ్చి, వన్ లైన్ ఆర్డర్ రాసి ఇవ్వమని చెప్పారు. ఆ పని సరిగ్గా చేయకపోతే పెళ్లి కేన్సిల్ అవుతుందేమోనని అనుకున్నాను.. కానీ అలా జరగలేదు. ఇది తమిళ కథనే అయినా, షూటింగు జరిగిందంతా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోనే. అందువలన ఇది తెలుగు వారి సినిమా. ఇక్కడ ఈ సినిమా దిల్ రాజు గారి బేబీ .. ఆయనే చూసుకోవాలి. ఇక విక్రమ్, కార్తి, జయం రవి అందరూ కూడా నాకు చాలా కాలంగా తెలుసు. ఇక రెహ్మాన్ మా ఫ్యామిలీకి సంబంధించిన వారు గానే చెప్పుకోవాలి. మణిరత్నంగారితో  ఆయనకి ఉన్న అనుబంధం సంగీతపరమైనది మాత్రమే కాదు .. దైవీకమైనదని నా ఉద్దేశం. ఈ సినిమాతో ఐశ్వర్యారాయ్ ని మరోసారి ప్రపంచమంతా పొగడబోతోంది” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular