Tuesday, March 17, 2026
Homeసినిమాడైరెక్ట్ గా ఓటీటీలో 'మళ్ళీ మొదలైంది'

డైరెక్ట్ గా ఓటీటీలో ‘మళ్ళీ మొదలైంది’

on Zee5: సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’. టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను ‘జీ 5′ ఓటీటీ ఎక్స్‌ క్లూజివ్‌గా విడుదల చేయనుంది. ఓటీటీ రైట్స్‌ ను దక్కించుకుంది. ఫిబ్రవరిలో సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథాంశంతో రూపొందిన సినిమా ‘మళ్ళీ మొదలైంది’. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్ రాజన్, న్యాయవాది పాత్రలో ముఖ్య కథానాయికగా నైనా గంగూలీ నటించారు.

ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ తెలుగు  ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన ‘ఎలోన్ ఎలోన్’కు అద్భుత స్పందన లభించింది. ఈ సినిమాకు చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈవో. ‘జీ 5’ ఓటీటీలో ఈ నెల 21న ‘లూజర్’ సీజన్ 2 విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘మళ్ళీ మొదలైంది’తో పాటు మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి.

Also Read :సిఎం జగన్ కు కైకాల కృతజ్ఞతాపూర్వక లేఖ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular