Saturday, January 18, 2025
Homeసినిమాసుమంత్ కొత్త సినిమా ప్రారంభం

సుమంత్ కొత్త సినిమా ప్రారంభం

‘ప్రేమకథ’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్. ఆ తర్వాత యువకుడు, పెళ్లి సంబంధం, స్నేహమంటే ఇదేరా చిత్రాల్లో నటించిన సుమంత్ కు సత్యం సినిమా విజయాన్ని అందించింది. ఆతర్వాత గౌరి, మహానంది, గోదావరి, చిన్నోడు, క్లాస్ మేట్స్, పౌరుడు, మధుమాసం, గోల్కండ హైస్కూల్ చిత్రాలతో సక్సస్ సాధించినా.. కెరీర్ లో ఇంకాస్త ముందుకు వెళ్లడానికి కావాల్సిన బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం రాలేదు. ఆమధ్య సరైన సక్సస్ లేక బాగా వెనకబడిన టైమ్ లో మళ్లీ రావా సినిమాతో మళ్లీ ట్రాక్ లో వచ్చాడు.

అయినప్పటికీ ఆతర్వాత చేసిన సుబ్రమణ్యపురం, ఇదంజగత్, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, కపటధారి చిత్రాలు ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఓ కొత్త సినిమాను ప్రారంభించాడు. దీనికి టి.జి. కీర్తి కుమార్ దర్శకుడు. రెడ్‌ సినిమాస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ఈరోజు  పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోల్ని సుమంత్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలో సాగే కథ ఇది అని చిత్ర యూనిట్ తెలియచేసింది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. మరి.. ఈ సినిమాతో అయినా సుమంత్ ఆశించిన సక్సస్ సాధిస్తారని ఆశిద్దాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్