Saturday, January 18, 2025
Homeసినిమా'తీస్ మార్ ఖాన్’ నుంచి సునీల్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్

‘తీస్ మార్ ఖాన్’ నుంచి సునీల్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్

కమెడియన్‌గా, హీరోగా, విలన్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోన్న సునీల్.. మరోసారి వినూత్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘లవ్‌లీ’ హీరో ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా ‘తీస్ మార్ ఖాన్’ అనే చిత్రం రాబోతోంది.  విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘నాటకం’ ఫేం కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇదివరకు విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు, పాటలు అందరినీ మెప్పించాయి. ఈ చిత్రం నుంచి మరొక అప్డేట్ వచ్చింది. సునీల్ పాత్రకు సంబంధించిన కారెక్టర్ పోస్టర్‌ను మేకర్లు విడుదల చేశారు. చక్రి  పాత్రలో సునీల్ కనిపించనున్నారు. ఈ చిత్రంతో మరోసారి సునీల్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు. ఈ చిత్రం ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్