Saturday, January 18, 2025
Homeసినిమాపుష్ప: మంగళం శ్రీను గా సునీల్ ఫస్ట్ లుక్

పుష్ప: మంగళం శ్రీను గా సునీల్ ఫస్ట్ లుక్

Sunil As Mangalam Srinu With Terrific Look In Pushpa :

పుష్ప ది రైజ్ సినిమా నుంచి అభిమానులకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్ డేట్ బయటికి వచ్చింది. మంగళం శ్రీనుగా సునీల్ పాత్రను పరిచయం చేశారు దర్శక నిర్మాతలు. ఇన్నేళ్లు ఆయనను కమెడియన్ గా, క‌థానాయ‌కుడుగా మాత్రమే చూసాం. ఇప్పుడు సునీల్ లోని మరో కోణాన్ని దర్శకుడు సుకుమార్ ఆవిష్కరిస్తున్నారు. అందుకే రాక్షసుడి పరిచయం చేస్తున్నాం అంటూ సునీల్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. జుట్టుకు రింగు.. ఫోన్ మాట్లాడుతూ ఉరిమి చూసే కళ్లు.. చూడగానే భయపడే రూపంతో సునీల్ పోస్టర్ అదిరిపోయింది.

దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్ లో ఉన్న ఇంపాక్ట్ కంటే.. సినిమాలో సునీల్ క్యారెక్టర్ 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పుష్ప పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది.

 వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహీత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:  

పుష్ప ‘శ్రీ వల్లి’ లిరికల్ సాంగ్ కు అద్భుత స్పందన

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్