Sunday, May 19, 2024
Homeసినిమాసునీల్‌, ధ‌న‌రాజ్ కాంబినేష‌న్‌లో `బుజ్జి ఇలా రా`

సునీల్‌, ధ‌న‌రాజ్ కాంబినేష‌న్‌లో `బుజ్జి ఇలా రా`

కొన్ని చిత్రాల్లో క‌మెడియ‌న్స్‌గా క‌లిసి మెప్పించిన సునీల్‌, ధ‌న‌రాజ్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న లేటెస్ట్ మూవీకి `బుజ్జి ఇలా రా` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. `ఇట్స్ ఎ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్` అనేది ట్యాగ్‌లైన్‌. సినిమాటోగ్రాఫర్ ‘గ‌రుడ‌వేగ అంజి’ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రాఫ‌ర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వ‌ర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ ప‌తాకాల‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భాను, నాయుడు మాట‌ల‌ను అందిస్తున్నారు. చాందిని త‌మిళ‌ ర‌స‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. సునీల్‌, ధ‌న‌రాజ్‌, చాందిని త‌మిళ‌ర‌స‌న్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, శ్రీకాంత్ అయ్య‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, వేణు, భూపాల్‌, టెంప‌ర్ వంశీ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణ‌: రూపా జ‌గ‌దీశ్‌, బ్యాన‌ర్స్‌: జి.నాగేశ్వ‌ర రెడ్డి టీమ్ వ‌ర్క్‌, ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, మ్యూజిక్‌: సాయి కార్తీక్‌, డైలాగ్స్‌: భాను,నాయుడు, ఆర్ట్‌: చిన్నా, ఎడిట‌ర్‌: చోటా కె.ప్ర‌సాద్‌, ఫైట్స్: రియ‌ల్ స‌తీశ్‌, కాస్ట్యూమ్స్‌: మ‌నోజ్‌, మేక‌ప్‌: వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సీతారామరాజు, నిర్మాత‌లు: అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్