Friday, March 29, 2024
Homeసినిమాఆకట్టుకుంటున్న `సూప‌ర్ డీల‌క్స్‌` ట్రైల‌ర్‌

ఆకట్టుకుంటున్న `సూప‌ర్ డీల‌క్స్‌` ట్రైల‌ర్‌

ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు ఒకే ఒక కేంద్రంగా ఉంటున్న హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో అంద‌రూ ఎదురు చూసేలా ఓ ఆస‌క్తిని క్రియేట్ చేసిన అంథాల‌జీ చిత్రం ‘సూప‌ర్ డీల‌క్స్‌’ ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం విడుదల చేశారు. స‌మంత అక్కినేని, విజ‌య్ సేతుప‌తి, ఫ‌హాద్ ఫాజిల్‌, ర‌మ్య‌కృష్ణ‌, మిస్కిన్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 6న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తుంది ఆహా. త్యాగ‌రాజ‌న్ కుమార్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం 2019లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. వైవిధ్య‌మైన క‌థ‌, క‌థనాల‌తో రూపొంది విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన ఈ చిత్రంలో నటీన‌టులు అద్భుత‌మైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు.

రీసెంట్‌గా విడుద‌లైన సూప‌ర్ డీల‌క్స్‌ ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే .. ఓ పెళ్లైన జంట అనుకోకుండా జ‌రిగిన హ‌త్య‌ను దాచాల‌నుకోవ‌డం, ఓ అడ‌ల్ట్ సినిమాలో న‌టించిన మ‌హిళ.. ప్ర‌శాంత‌మైన జీవితాన్ని గ‌డ‌పాల‌నుకోవ‌డం, ఓ వ్య‌క్తి లైంగిక సంబంధ‌మైన స‌మ‌స్య‌లు, మ‌తాన్ని గొప్ప‌గా న‌మ్మే ఓ వ్య‌క్తి కొంత‌ మంది యువ‌కుల జీవితాల‌ను పాడు చేయాల‌నుకోవ‌డం.. ఇలా ఈ అంథాల‌జీ వేర్వేరు క‌థ‌లను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసింది. ఈ జీవితాలను కలిపి ఉంచేది ఏమిటి? కామం, అవిశ్వాసం, లైంగికత, మతం, నేరం వంటి ఇతివృత్తాలను తెలియ‌జేసేలా సూప‌ర్ డీల‌క్స్ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది.

విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో త‌ను పోషించిన పాత్ర‌కుగానూ బెస్ట్ స‌పోర్టింగ్ రోల్ కేట‌గిరిలో జాతీయ అవార్డును ద‌క్కించుకున్నారు. గాయ‌త్రి, అశ్వంత్ అశోక్ కుమార్‌, అబ్దుల్ జ‌బ్బార్‌, విజ‌య్ రామ్‌, నోబెల్ కె.జేమ్స్‌, మృణాళిని ర‌వి ఈ చిత్రంలో ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. త్యాగ‌రాజ‌న్ కుమార్ రాజా, మిస్కిన్‌, న‌ల‌న్ కుమార‌స్వామి, నీల‌న్‌.కె శేఖ‌ర్ ఈ అంథాల‌జీని ర‌చ‌నా విభాగంలో ప‌ని చేశారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు యువ‌న్ శంక‌ర్ రాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. నాటి డిస్కో డాన్సర్ కు సెట్ చేయబడిన ఈ చిత్రం యొక్క ప్రోమోను కూడా ఆహా తన యూట్యూబ్ ఛానెల్ లో విడుదల చేసింది, ఇది ప్రేక్ష‌కుల‌ను మ‌రింత‌గా ఆకర్షించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్