Sunday, March 8, 2026
HomeTrending Newsరాజకీయాల్లోకి రావటం లేదు

రాజకీయాల్లోకి రావటం లేదు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాను రాజకీయాల్లోకి రావటం లేదని మరోసారి స్పష్టం చేశారు. సోమవారం చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత పోయెస్‌ గార్డెన్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవల నేను అమెరికా వెళ్లొచ్చానన్నారు. సినిమా షూటింగులు, ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల రీత్యా గత కొంతకాలం నుంచి మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో సరిగ్గా సంప్రదింపులు జరపలేకపోయానని రజని చెప్పారు.

నా రాజకీయ అరంగేట్రంపై ఎన్నో సందేహాలున్నాయి. భవిష్యత్తులో నేను రాజకీయాల్లోకి వస్తానా? రానా? అని అడుగుతున్నారు. అయితే నేను రాజకీయాల్లోకి రావట్లేదని రజని తేల్చి చెప్పారు. మక్కళ్‌ మండ్రంను రద్దు చేస్తున్నానని, దాని స్థానంలో రజనీ అభిమాన సంక్షేమ మండ్రం ఏర్పాటు చేస్తున్నానని రజనీ ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular