అమరావతి రాజధాని విషయంలో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి భారత సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. గతంలో తాము అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మూడు రాజధానుల తీర్మానాన్ని ఉపసంహారించుకున్నామని,  కాబట్టి ఇప్పుడు హైకోర్టు తీర్పును నిలుపుదల చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని సుప్రీం తిరస్కరించింది. తదుపరి విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేసింది. AP CRDA చట్టం ప్రకారం అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది.

కాగా, ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనంలోని సీనియర్ జడ్జి కేఎం జోసెఫ్ జూన్ లో పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ లోపు సుదీర్ఘంగా వాదనలు విని తీర్పు రాయడానికి జోసెఫ్ సుముఖంగా లేనట్లు తెలియవచ్చింది. అందుకే ఆయన ఈ కేసులు జూలై కు వాయిదా వేశారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *