Monday, February 24, 2025
HomeTrending NewsHCAను రద్దు చేసిన సుప్రీం కోర్టు

HCAను రద్దు చేసిన సుప్రీం కోర్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.  కొత్త కమిటీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి లావు నాగేశ్వరరావుతో ఏక సభ్య కమిటీ ని నియమించింది. ఇకపై  అసోసియేషన్ వ్యవహారాలను ఈ కమిటీ చూసుకుంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

సంజయ్ కిషన్ కౌల్, మనోజ్ మిశ్రా, అరవింద్ కుమార్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది.  అసోసియేషన్ లో ప్రస్తుతం నెలకొన్న సందిగ్ధత అతి త్వరలో సమసిపోవాలని, అందుకే కొత్త కమిటీ ఎన్నిక నిష్పాక్షికంగా, సక్రమంగా జరగాలని, ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు, అప్పటి వరకూ అసోసియేషన్ వ్యవహారాలూ పర్యవేక్షించేందుకు జస్టిస్ లావు నాగేశ్వరరావు తో ఓ కమిటీని నియమిస్తున్నట్లు వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్