భిమా కొరెగావ్ కుట్ర కేసులో అరెస్ట్ అయిన విప్లవ రచయితల సంఘం నేత వరవరరావుకు ఈ రోజు (బుధవారం) బెయిల్ మంజూరైంది. భిమా కొరేగావ్ హింసకు వరవర రావు కుట్ర పన్నారనే అభియోగాల కింద ఎన్ఐఏ అప్పట్లో వరవర రావును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా నేడు సుప్రీం కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
రెండేళ్లకుపైగా కాలం నుంచి ముంబై జైల్లో ఉంటున్న వరవర రావు కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో కోర్టు ఆయనకు ఈ బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యం దృష్ట్యా మెడికల్ బెయిల్ మంజూరు చేస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.