Friday, November 22, 2024
HomeTrending Newsలఖింపుర్‌ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ

లఖింపుర్‌ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ

లఖింపుర్‌ ఖేరి ఘటనపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు. రైతుల మృతి ఘటనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కు లేఖ రాసిన న్యాయవాదులు శివ కుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా. ఘటనకు బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి శిక్షించాలన్న న్యాయవాది శివ కుమార్ త్రిపాఠి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ హిమ కొహ్లి, సూర్య కాంత్ లతో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది.

ప్రత్యేక దర్యాప్తు బృందం, జ్యుడీషియల్ కమిషన్ కూడా ఏర్పాటు చేసామని ధర్మాసనానికి తెలిపిన యూపీ ప్రభుత్వం తరపు న్యాయవాది. ఎఫ్ఐఆర్ నమోదు చేసాం. దర్యాప్తు జరుగుతోందని వివరణ. సరైన దర్యాప్తు, ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయలేదని ఫిర్యాదు ఉందన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. రేపు స్టేటస్ రిపోర్ట్ అందజేయాలని ఆదేశం. ఎఫ్ఐఆర్ లో నిందితులుగా ఎవరిని పేర్కొన్నారు, మరణించిన వారి వివరాలు స్టేటస్ రిపోర్ట్ లో ఇవ్వాలని ఆదేశం. ఘటనలో కుమారుడి మరణవార్త విని అనారోగ్యానికి గురైన లవ్ ప్రీత్ సింగ్ తల్లికి మెరుగైన వైద్యం అందించాలని యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. ఇదే అంశంపై యూపీ హై కోర్ట్ లో దాఖలైన పిటిషన్ల పరిస్థితి తెలియజేయాలని ఆదేశం.

లఖింపుర్‌ ఖేరి ఘటన అంశాన్ని సుమోటోగా పేర్కొన్నా అంతకు ముందే కేసును ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా సుప్రీంకోర్టు స్వీకరించిందని రిజిస్ట్రార్ వెల్లడించారు. సమాచార లోపం వాళ్ళ ఇది జరిగిందని వివరణ ఇచ్చారు. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్