Tuesday, February 25, 2025
HomeTrending NewsSupreme Court: మ‌థుర‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై సుప్రీం స్టే

Supreme Court: మ‌థుర‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై సుప్రీం స్టే

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌థుర‌లో ఉన్న శ్రీ కృష్ణ జ‌న్మ‌భూమి స‌మీపంలో నాయి బ‌స్తీలో రైల్వే శాఖ అక్ర‌మ నిర్మాణాల‌ను తొలిగిస్తోంది. అయితే ఆ డ్రైవ్‌ను నిలిపివేయాల‌ని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప‌ది రోజుల పాటు కూల్చివేత ప్ర‌క్రియ‌ను నిలుపుద‌ల చేయాల‌ని కోర్టు త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది. 66 ఏళ్ల యాకుబ్ షా వేసిన పిటిష‌న్ ఆధారంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. నాయి బ‌స్తీ ప్రాంతంలో త‌మ కుటుంబాలు 1880 నుంచి నివ‌సిస్తున్న‌ట్లు పిటీష‌న్‌లో తెలిపారు. ఆగ‌స్టు 9వ తేదీ నుంచి రైల్వేశాఖ తొల‌గింపు ప్ర‌క్రియ చేప‌ట్టింది.

ఈ కేసులో వ‌చ్చే వారం మ‌ళ్లీ వాద‌న‌లు కొన‌సాగున్నాయి. షా త‌ర‌పున సీనియర్ న్యాయ‌వాది ప్ర‌శాంతో చంద్ర సేన్ వాదిస్తున్నారు. కౌశిక్ చౌద‌రీ, రాధా తార్క‌ర్, ఆర‌న్ షాలు అడ్వ‌కేట్లుగా ఉన్నారు. స్థానిక సివిల్ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా.. షా మాత్రం సుప్రీంను ఆశ్ర‌యించారు. రైల్వే భూములు ఆక్రమణలు తొలగించకపోతే రైల్వే విస్తరణ పనులు సాగవని స్థానిక పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్