Saturday, January 18, 2025
HomeTrending Newsనుపూర్ శర్మకు సుప్రీంకోర్టు మందలింపు

నుపూర్ శర్మకు సుప్రీంకోర్టు మందలింపు

మహ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి  సస్పెండైన నుపుర్ శర్మ పై  సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఆమె వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని ఫైర్ అయింది.  అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించింది.  మీడియా ద్వారా నుపుర్ శర్మ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. పార్టీ అధికార ప్రతినిధి అయినంత మాత్రాన ఏదిపడితే అది మాట్లాడతారా అని చురకలు అంటించింది.

ఆమె పిటిషన్లు బట్టి చూస్తే న్యాయమూర్తులను కూడా ఆమె చాలా తక్కువగా భావిస్తున్నట్లు తెలుస్తుందని సుప్రీం మందలించింది. దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లకు నుపుర్ శర్మనే బాధ్యురాలంది. నపూర్ శర్మ వ్యాఖ్యలు ఆమె అహంకారాన్ని తెలియజేస్తున్నాయని జ‌స్టిస్ సూర్య కాంత్ త‌న తీర్పులో అభిప్రాయ‌ప‌డ్డారు. దేశవ్యాప్తంగా తన పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ దర్యాప్తు నిమిత్తం ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ నుపుర్ శర్మ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసింది.  తనకు నిత్యం ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేప‌థ్యంలో ఆ పిటిష‌న్‌పై అత్యున్నత న్యాయ‌స్థానం స్పందిస్తూ శర్మ అభ్యర్థనను తోసిపుచ్చింది. దీనితో నుపుర్ శర్మ తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్