Thursday, January 23, 2025
Homeసినిమా'సూర్య 42' మోషన్ పోస్టర్ రిలీజ్

‘సూర్య 42’ మోషన్ పోస్టర్ రిలీజ్

విలక్షణ పాత్రలతో తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వర్సటైల్ స్టార్ సూర్య. మాస్ కమర్షియల్ సినిమాలతో అగ్ర దర్శకుడిగా ఎదిగిన శివ కాంబినేషన్‌లో నూతన చిత్రం ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమైంది. భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌తో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మొదటి నుంచి కమర్షియల్ తో పాటు వినూత్నమైన కథలను ఎన్నుకుంటూ.. మిర్చి, మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, బాగమతి లాంటి ఎన్నో విజయాలతో అగ్ర నిర్మాణ సంస్థగా నిలిచింది యూవీ క్రియేషన్స్. సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలతో బాలీవుడ్ లో కూడా యూవీ క్రియేషన్స్ సత్తా చూపించింది. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో సూర్య, అగ్ర దర్శకుడు శివ కాంబినేషన్‌లో స్టార్ హీరో సూర్య న‌టించిన 42వ సినిమాగా స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ నెం 25గా యువి క్రియేషన్స్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ తాజాగా విడుద‌లైంది.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా స్థాయికి ఏ మాత్రం త‌గ్గ‌ని రీతిలో ఈ మోష‌న్ పోస్ట‌ర్ ని రెడీ చేశారు. ఆకాశంలో మ‌బ్బులు పైన అంతెత్తున ఎగురుతున ప‌క్షి మారాజు గెద్ద పై నుంచి నిట్ట నిలువున క్రింద‌కు రావ‌డం, వ‌స్తూనే యుద్ధ వాత‌వ‌ర‌ణంతో భీతుల్లితున్న నేల‌, ఈగ‌ల్ ఐ వ్యూ లో యుద్ధం భూమిని చూపిస్తునే చివ‌ర‌కు ఆ గెద్ద ఓ వారియ‌ర్ భుజం పై వాల‌డంతో ఈ మోష‌న్ పోస్టర్ ముగుస్తుంది. ఈ గ్రాండ్ విజువ‌ల్ కి త‌గ్గ‌ట్టుగానే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అత్యంత అద్భుత‌మైన మ్యూజిక్ అందించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీత ద‌ర్శ‌కునిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు

Also Read : సూర్య, శివ కాంబో మూవీ ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్