Friday, April 19, 2024
Homeసినిమామంచు విష్ణు 'జిన్నా' టీజర్ రిలీజ్

మంచు విష్ణు ‘జిన్నా’ టీజర్ రిలీజ్

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా‘. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఇశాన్ సూర్య దర్శకుడు. భారీ తారాగణం, బడా సాంకేతిక నిపుణులతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది ఈ చిత్రం. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ల అందం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానుంది. జి. నాగేశ్వర్ రెడ్డి కథ అందించిన ఈ చిత్రానికి.. కోన వెంకట్ స్క్రిప్టు అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

జిన్నా టీజర్ వేడుక హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్, కోన వెంకట్, అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు. టీజర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో విష్ణు డైలాగ్ డిక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ లా అనిపిస్తున్నప్పటికీ.. టీజర్ చివరిలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఢీ, దేనికైనా రెడీ తర్వాత విష్ణు కెరీర్ లో ఆ స్థాయి విజయాన్ని అందుకోగల సత్తా ఉన్న సినిమా అనే నమ్మకాన్ని టీజర్ కలిగిస్తోంది.

విష్ణు మాట్లాడుతూ.. “అభిమానుల ప్రేమ, అభిమానం కోసమే మేం సినిమాలు చేసేది. అభిమానులు లేకపోతే మేం లేము. జిన్నా నా మనసుకి దగ్గరైన సినిమా. ఇందులో ఎన్నో విశేషాలు ఉన్నాయి. నా బంగారు తల్లులు అరియనా, విరియానా పాట పాడారు. వాళ్ళతో పాడించినందుకు బిగ్ థాంక్స్. మా నాన్నగారు కోన వెంకట్ గారిని బాబాయ్ అని పిలిస్తే, నేను మాత్రం బ్రదర్ అని పిలుస్తాను. నా కెరీర్ లో నాగేశ్వరరెడ్డి గారికి ప్రత్యేక స్థానముంటుంది. నేను డౌన్ లో ఉన్న టైంలో ఆయన నాకు ‘దేనికైనా రెడీ’ తో సూపర్ హిట్ ఇచ్చారు.

ఈ సినిమాలో నా కంటే ముందు సన్నీనే ఫైనల్ చేశారు. కానీ ఇక్కడ సన్నీని ఎలా రిసీవ్ చేసుకుంటారని భయం ఉండేది. కానీ కోన గారు, నాన్నగారు, తెలిసిన మీడియా మిత్రులు సన్నీకే ఓటు వేశారు. ఢీ ఇచ్చిన శ్రీను వైట్ల గారి తర్వాత నన్ను అంతలా మెప్పించాడు డైరెక్టర్ సూర్య. అనూప్ తో ఎప్పటినుంచో పని చేయాలి అనుకున్నాను. ఈ సినిమాతో కుదిరింది. దేశంలోని గొప్ప సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరైన చోటా గారితో పని చేయడం గర్వంగా ఉంది. హీరోయిన్ గా పాయల్ అనగానే.. ఒకవైపు సన్నీ, మరోవైపు పాయల్ ఇక నన్ను ఎవరు చూస్తారు అనుకున్నా.” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్