Saturday, March 14, 2026
Homeస్పోర్ట్స్IPL: సూర్య కుమార్ యాదవ్ సెంచరీ: గుజరాత్ పై ముంబై విజయం

IPL: సూర్య కుమార్ యాదవ్ సెంచరీ: గుజరాత్ పై ముంబై విజయం

ముంబై స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులతో అజేయంగా నిలవడంతో నేడు జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ముంబై ఇండియన్స్ 27 పరుగులతో విజయం సాధించింది. ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన  నేటి మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  ముంబై జట్టులో సూర్య తో పాటు ఇషాన్ కిషన్-31; విష్ణు వినోద్-30; రోహిత్ శర్మ-29 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ ­4; మోహిత్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్య ఛేదనలో ఒత్తిడికి గురైన గుజరాత్ 26 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. వృద్ధిమాన్ సాహా-; శుభ్ మన్ గిల్-; కెప్టెన్ హార్దిక్ పాండ్యా- పరుగులే చేసి వెనుదిరిగారు. విజయ్ శంకర్ -29; డేవిడ్ మిల్లర్-41 పరుగులు చేసి ఇన్నింగ్స్ గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. కానీ 103 పరుగుల నాటికి మరో ఐదు వికెట్లు కోల్పోయింది. అభినవ్ మనోహర్-; రాహుల్ తెవాటియా-; నూర్ అహ్మద్ కూడా విఫలమయ్యారు. ఈ దశలో రషీద్ ఖాన్ ఒంటరి పోరాటం చేస్తూ… సిక్సర్లతో మోతమోగించి… కాసేపు ముంబై జట్టును వణికించాడు. అల్జారీ జోసెఫ్ తో కలిసి తొమ్మిదో వికెట్ కు 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో గుజరాత్ కు ఓటమి తప్పలేదు. రషీద్ ఖాన్  32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో 79 పరుగులతో అజేయంగా నిలిచాడు, గుజరాత్ 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది.

ముంబై బౌలర్లలో ఆకాష్ మధ్వాల్ 3; పియూష్ చావ్లా, కుమార్ కార్తికేయ చెరో 2;  బెహ్రెండార్ఫ్ 1  ఒక వికెట్ పడగొట్టారు.

సూర్య కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular