Saturday, June 27, 2026
Homeసినిమాచ‌ర‌ణ్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో మూవీ

చ‌ర‌ణ్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో మూవీ

Mega Combination: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో మూవీ గురించి గ‌త కొంత కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు సెట్ కాలేదు. ఇదిలా ఉంటే.. రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న విడుద‌ల కానుంది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే.. రామ్ చ‌ర‌ణ్‌.. గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. అలాగే జెర్సీ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరితో కూడా ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఇలా వ‌రుస‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు చ‌ర‌ణ్‌.

అయితే… చ‌ర‌ణ్ హీరోగా త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ లో మూవీ ఉంటుందని యువ నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ప్ర‌క‌టించారు. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన డీజె టిల్లు సినిమా ఈ నెల 12న విడుద‌ల‌ సంద‌ర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో నిర్మాత‌ నాగ‌వంశీ మాట్లాడుతూ.. చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. చ‌ర‌ణ్ తో  సినిమా చేయాలని అనుకుంటున్నాను. చరణ్ తో చేసే సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారు. మ‌హేష్ తో చేస్తున్న సినిమా త‌ర్వాత ఉంటుందా..?  లేక ఎన్టీఆర్ తో చేయ‌నున్న సినిమా త‌ర్వాత ఉంటుందా..? అనేది ఇప్పుడు చెప్ప‌లేను కానీ.. ఖ‌చ్చితంగా చ‌ర‌ణ్ తో సినిమా ఉంటుంద‌ని మాత్రం చెప్ప‌గ‌ల‌ను” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular