Sunday, June 14, 2026
Homeసినిమాఇంకా తేలని ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్

ఇంకా తేలని ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాను భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి. దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ మూవీని విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో ఆర్ఆర్ఆర్ 2022 సంక్రాంతికి రానుందని వార్తలు వచ్చాయి. ఆతర్వాత సంక్రాంతికి కాదు.. 2022 సమ్మర్ లో రానుంది అని కూడా వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ విడుదల పై ఓ వార్త హల్ చల్ చేస్తుంది. అది ఏంటంటే… జులైలో షూటింగ్ స్టార్ట్ చేసినా డిసెంబర్ కి కంప్లీట్ అవుతుంది. ఆతర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి రెండు లేదా మూడు నెలల టైమ్ పట్టచ్చు. అందుచేత అన్ని పనులు పూర్తి చేసి ఆర్ఆర్ఆర్ మూవీని 2022లో ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నారనేది ఆ వార్త సారాంశం. ఈ విషయాన్ని రాజమౌళి ఈ చిత్ర హీరోలు ఎన్టీఆర్, చరణ్‌ లకు అలాగే నిర్మాత దానయ్యకు చెప్పారని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత కొరటాల శివతో చేయనున్న సినిమాని 2022 ఏప్రిల్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అందుచేత ఆర్ఆర్ఆర్ 2022 సంక్రాంతికి వచ్చే అవకాశాలే ఎక్కువ అని చెప్పచ్చు. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై జక్కన్న క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular