దూకుడుగా వ్యవహరిస్తున్న బిజెపి నేతల తీరుతో విపక్షాల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. కమలం నేతల కార్యాచరణ అనుమానాలకు తావిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది జనవరిలో లోక్‌సభ ఎన్నికలకు వెళ్లొచ్చని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనరీ తెలిపారు. ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా, ప్రచారం కోసం ఇప్పటికే బీజేపీ హెలికాప్టర్లన్నీ బుక్ చేసుకున్నదని చెప్పారు.
బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో నిరంకుశ పాలనే రాజ్యమేలుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సోమవారం కోల్‌కతాలో జరిగిన టీఎంసీ యూత్ వింగ్ ర్యాలీని ఉద్దేశించి మమత మాట్లాడారు. అలాంటి పార్టీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే, పరిస్థితులు దారుణంగా ఉంటాయని, మన దేశాన్ని విద్వేషపు దేశంగా మారుస్తుందని ప్రజలను హెచ్చరించారు.