డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకం పై సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి‘. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఫ్రీ రిలీజ్ ట్రైలర్ అండ్ డిజిటల్ టికెట్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేసి ట్రైలర్ బాగుంది అంటూ టీమ్ ని అభినందించారు. చిత్ర దర్శకుడు సురేంద్ర మాదారపు మాట్లాడుతూ.. సక్సెస్ ఫుల్  ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి చేతుల మీదుగా మా సినిమా ఫస్ట్ టికెట్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకులు ముందుకి వస్తున్న మా సినిమా మంచి టెక్నికల్ వాల్యూస్ తో ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందని ఆశిస్తున్నాం. జయప్రద, పూర్ణ, సాక్షి, ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినిడు, అవినాష్, సత్యప్రకాశ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, సినిమాటోగ్రఫీ: యెల్లుమహంతి ఈశ్వర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, పీఆర్వో: బి. వీరబాబు, సహ నిర్మాత: శ్రీకాంత్ పండుగల, సమర్పణ:డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి, నిర్మాత: ఎమ్.ఎల్. లక్ష్మీ, రచన,దర్శకత్వం: సురేంద్ర మాదారపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *