Saturday, January 18, 2025
Homeసినిమావీరభద్రమ్ సినిమాలో శ్వేత అవస్తి

వీరభద్రమ్ సినిమాలో శ్వేత అవస్తి

Swetha New: పూలరంగడు, చుట్టాలబ్బాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో మత్తువదలారా,సేనాపతి చిత్రాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా ఇటివలే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. డెక్కన్ డ్రీమ్ వర్క్స్, జయదుర్గాదేవి మల్టీమీడియా బ్యానర్లపై నబిషేక్, తూము నర్సింహా పటేల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రానికి సంబధించిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. ఈ చిత్రంలో మెరిసే మెరిసే ఫేమ్ శ్వేత అవస్తి కథానాయికగా కనిపించనున్నారు.ఈ నెలలో ప్రారంభం కానున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ షూట్‌లో శ్వేత అవస్తి జాయిన్ కానున్నారు. ఈ చిత్రం కోసం వీరభద్రమ్ చౌదరి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. మెలోడీ స్పెషలిస్ట్ అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మరికొంత మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇంకా టైటిల్ ఖ‌రారు కానీ ఈ చిత్రానికి సంబధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు నిర్మాతలు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్