Saturday, November 23, 2024
HomeTrending Newsఇండోనేషియాలో అన్ని రకాల సిరప్‌లపై నిషేధం

ఇండోనేషియాలో అన్ని రకాల సిరప్‌లపై నిషేధం

ఇండోనేషియాలో అన్ని సిరప్‌లు, లిక్విడ్‌ మెడిసిన్స్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల్లో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందినట్లు తెలుస్తుండగా.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయా సిరప్‌లు తీసుకున్న తర్వాత పిల్లల కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వార్తలున్నాయి. ఈ క్రమంలో పిల్లలకు సంబంధించిన అన్ని సిరప్‌లు, లిక్విడ్‌ మెడిసిన్‌ సప్లిమెంట్స్‌ను విక్రయాలను ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు.

గత జనవరి నుంచి దేశంలో పిల్లల మరణాల సంఖ్య పెరిగింది. దేశంలోని 20 ప్రావిన్సుల్లో 99 మరణాలు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి మొహ్మద్‌ సయారిల్‌ మన్సూర్‌ పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా సిరప్‌లు, లిక్విడ్‌ మెడిసిన్స్‌ను సిఫారసు చేయొద్దని వైద్యులకు ఆదేశాలచ్చినట్లు మన్సూర్‌ పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యే వరకు సిరప్‌ విక్రయాలు చేపట్టొద్దని మెడికల్‌ స్టోర్స్‌ను మంత్రిత్వశాఖ ఆదేశించింది.

ఇదిలా ఉండగా.. ఆఫ్రికా దేశమైన గాంబియాలో దగ్గు సిరప్‌ కారణంగా 70 మంది పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే. డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ అధిక మోతాదులో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ ఉదంతంపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇండోనేషియాలో పిల్లల మరణాలు వెలుగులోకి వచ్చింది. భారత్‌లో సిరప్‌ తయారు కాగా.. దగ్గు మందుతో దేశంలో కూడా మరణాలు చోటు చేసుకున్నాయా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్