Saturday, February 22, 2025
HomeTrending NewsTSRTC: తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్

TSRTC: తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. పల్లె వెలుగు బస్సు సర్వీసుల్లో 60 ఏండ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు టికెట్‌లో 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌ నగరంలో 24 గంటల పాటు అపరిమిత ప్రయాణానికి అందించే టీ-24 టికెట్‌ను అందరికీ కేవలం రూ.75కే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ టికెట్ ధర సాధారణ ప్రయాణికులకు రూ. 120.  మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ. 100గా ఉన్నది. పిల్లలకు ఈ టికెట్ రూ. 80గా ఉన్నది. అయితే.. పంద్రాగస్టు రోజున ఈ టికెట్ రేట్‌ను భారీగా తగ్గించింది.

పిల్లలకు మాత్రం టీ-24 టికెట్‌ను రూ.50కే అందజేయనున్నది. పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్