Sunday, February 23, 2025
HomeTrending Newsబిజేపి అంటేనే జూటా పార్టీ - మంత్రి హరీష్ రావు

బిజేపి అంటేనే జూటా పార్టీ – మంత్రి హరీష్ రావు

బిజేపి అంటేనే జూటా పార్టీ, జూటా మాటలని మంత్రి హరీష్ రావు ఘాటుగా విమర్శించారు. కర్ణాటకలో డబుల్ ఇంజిన్.. ఇక్కడి పథకాలు అక్కడ ఎందుకు లేవని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలంలో మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… బిజెపి పాలిత రాష్ట్రాల్లో రు.2016 పింఛన్, కల్యాణ లక్ష్మి, పంట పెట్టుబడి ఎందుకు ఇవ్వడం లేదన్నారు.

కాంగ్రెస్ హయాంలో నాణ్యత లేని పనులు చేసి బిల్లులు లేవట్టే వారు. కానీ టి.ఆర్.ఎస్ హయాంలో నాణ్యతతో కూడుకున్న పనులు జరిగాయని మంత్రి తెలిపారు. గత 5 ఏళ్లలో రు. 36 కోట్లతో రోడ్లు ఏర్పాటు చేశాం. 54 తండాలు గ్రామ పంచాయతీలు చేశాం. కొత్త బిల్డింగ్ కు 25 లక్షలు శాంక్షన్ చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. 70 ఏళ్లలో కనీసం ఒక్క గిరిజన పాటశాల లేదు. భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక నాలుగు మీకు వచ్చాయి. గిరిజన బిడ్డలు డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారన్నారు.

రైతులకు ఎలాంటి కష్టం ఉండకూడదని పంట పెట్టుబడి సాయం ఇస్తున్నామని, కర్ణాటకలో ఏముంది. రైతు బంధు ఉందా, రైతు బీమా ఉందా, కల్యాణ లక్ష్మి ఉందా.. అన్నారు. కాన్పు కావాలంటే నాడు బీదర్ పోయేవాళ్ళు.. ఇప్పుడు కర్ణాటక నుండి ఇక్కడికి వస్తున్నారన్నారు. నారాయణ్ ఖెడ్ లో భవిషత్ లో టి డయాగ్నొస్టిక్ తీసుకువస్తామని మంత్రి హరీష్ తెలిపారు.

ఎస్టీ ప్రజల చిరకాల ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలోని అన్నిగూడెంలు,తండాలను గ్రామపంచాయతీలుగా మార్చింది మన సీఎం అని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3146 మంది ఎస్టీలు కొత్తగా సర్పంచులు అయ్యారని తెలిపారు. ఎస్టీ సంక్షేమం కోసం బడ్జెట్ లో 600 కోట్లు పెట్టుకున్నాం. అన్ని తండాలకు రోడ్లు వేస్తామని పేర్కొన్నారు.

Also Read : బీజేపీ దగ్గర విషం తప్ప విషయం లేదు -మంత్రి హరీష్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్