Friday, April 19, 2024
HomeTrending Newsబీజేపీ దగ్గర విషం తప్ప విషయం లేదు -మంత్రి హరీష్

బీజేపీ దగ్గర విషం తప్ప విషయం లేదు -మంత్రి హరీష్

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో దేశానికి తెలంగాణ కు ఎదో నిర్దేశనం చేస్తారనుకుంటే ప్రజలకు నిరాశే మిగిలిందని మంత్రి హరీష్ రావు అన్నారు. అధికార యావ, కేసీఆర్ నామ స్మరణ తప్ప మరేమీ కనిపించలేదన్నారు. హైదరాబాద్ టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు, ఎంపి బిబి పాటిల్ , ఎమ్మెల్యే గొంగిది సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మోడీ ప్రసంగంలో విభజన చట్టం హామీల ఊసే లేదన్నారు. 8 రాష్ట్రాల సీఎం లు వచ్చారు. తెలంగాణ కంటే ఎక్కువ ఏం చేశారో చెబుతారనుకున్నామని, బీజేపీ దగ్గర విషం తప్ప విషయం లేదు అని మరోసారి రుజువైందని విమర్శించారు. అమిత్ షా నీళ్లు నిధులు నియామకాల గురించి మాట్లాడారని, నీళ్లు రాక పోతే మోడీ లక్ష కోట్ల రూపాయల విలువైన ధాన్యం తెలంగాణ నుంచి ఎలా కొనమంటామని ప్రశ్నించారు. నిజాలు చెప్పక అమిత్ షా అభాసు పాలయ్యారు.స్థాయి తగ్గించుకున్నారన్నారు. అమిత్ షా తన వ్యాఖ్యలతో తెలంగాణ రైతులను అవమానించారన్నారు.
సంపద పెంచాం గనుకే తెలంగాణలో సంక్షేమం డబుల్ ఇంజిన్ సర్కార్ ల కన్నా ఎక్కువ ఉందని మంత్రి హరీష్ వెల్లడించారు. యూపీ తలసరి ఆదాయం మన కన్నా మూడు రెట్లు తక్కువని, కేసీఆర్ సింగిల్ ఇంజిన్ సర్కార్ ఉన్నా డబుల్ ఇంజిన్ సర్కార్ కన్నా ఎక్కువ ప్రగతి చేస్తున్నామన్నారు. దమ్ముంటే 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో అమిత్ షా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ కు కేంద్రం వెచ్చిస్తోంది కేవలం 170 కోట్లే.. ఆరోగ్య శ్రీ కి తెలంగాణ ప్రభుత్వం వెచ్చిస్తోంది 900 కోట్లు అని, 85 లక్షల మంది కి ఆరోగ్య శ్రీ వర్తిస్తే కేవలం 26 లక్షల మంది కే ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుందన్నారు.

మహిళల గురించి ఎదో గొప్పగా మోడీ మాట్లాడారని, మహిళకు కన్నీళ్లు తెప్పిస్తున్న సీలిండర్ ధర పెంచిన విషయం ఎందుకు చెప్పలేదని హరీష్ ప్రశ్నించారు. మహిళా రిజెర్వేషన్ల విషయం ఎందుకు మోడీ మాట్లాడలేదన్నారు. బీజేపీ నేతలకు atm అంటే ఎనీ టైం మీటర్.. కాళేశ్వరం మా దృష్టిలో ఎనీ టైం వాటర్ అని వివరించారు. ఎనిమిదేళ్లలో ఇచ్చిన ఒక్క హామీకి దిక్కు లేకుండా పోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ తన పాత్ర గురించి గొప్పగా చెప్పుకుంటోంది.. ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏమిటి అన్నారు. కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా పారిపోయారని, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పై నిన్న కూడా అమిత్ షా విషం గక్కారని ఆరోపించారు.

Also Read మోడీ, షా పర్యటనలు ఎందుకు -మంత్రి హరీష్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్