టిఆర్ఎస్ భ్రమలు ఎంతోకాలం ఉండవు – ఎమ్మెల్యే ఈటెల

టిఆర్ఎస్ నేతలు బావిలో కప్పలా ఉన్నారని బిజెపి ఎమ్మెల్యే, ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. బిజేపీ వార్తలు రాకుండా కట్టడి చేయాలని వికృత చేష్టలకు దిగారని విమర్శించారు. బిజెపి విజయ సంకల్ప సభ విజయవంత అయిందని ఈ రోజు హైదరాబాద్ లో ఈటల రాజేందర్ తెలిపారు. బిజేపీ పండగ వాతావరణం చెడగొట్టే ప్రయత్నం చేశారని, టిఆర్ఎస్ భ్రమలు ఎంతోకాలం ఉండవని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మా పార్టీ అధిష్టానం ఆదేశించిందని వెల్లడించారు. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వస్తామని కెసిఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు.

ప్రాంతీయ పార్టీలో, జాతీయ పార్టీలో ఉండే తేడాను గమనించానని, ప్రాంతీయ పార్టీలో వ్యక్తి కేంద్రంగా నిర్ణయాలు ఉంటాయని ఈటల రాజేందర్ అన్నారు. జాతీయ పార్టీలో అందరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిజెపి అధికారంలోకి రావటం ఖాయమన్నారు. పార్టీ బలోపేతం, ఎన్నికల స్ట్రాటజీ అమలు పై అగ్రనేతలు సూచనలు చేశారని, యువత లో చైతన్యం నిన్న సభలో స్పష్టంగా కనిపించిందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

Also Read ప్రభుత్వానికి ఈటల రాజేందర్ వార్నింగ్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *