Sunday, January 19, 2025
HomeTrending Newsత్వ‌ర‌లోనే ఇంట‌ర్ విద్యార్థుల‌కు ట్యాబ్స్ పంపిణీ

త్వ‌ర‌లోనే ఇంట‌ర్ విద్యార్థుల‌కు ట్యాబ్స్ పంపిణీ

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని ప్ర‌భుత్వ క‌ళాశాల విద్యార్థుల‌కు గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా త్వ‌ర‌లోనే ట్యాబ్లెట్స్ పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంట‌ర్ చ‌దువుతున్న విద్యార్థుల‌కు ఈ ట్యాబ్స్ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయ‌ని పేర్కొన్నారు. ఈ ట్యాబ్స్‌లో ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఉప‌యోగ‌ప‌డే మెటీరియ‌ల్‌ను పొందుప‌రిచిన‌ట్లు కేటీఆర్ తెలిపారు. ఇంట‌ర్ మెటీరియ‌ల్‌తో పాటు పోటీ ప‌రీక్ష‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే స‌మాచారం కూడా అందుబాటులోకి తీసుకొచ్చామ‌న్నారు. అయితే త‌న హామీని నెర‌వేర్చుకునే స‌మ‌యం ఆస‌న్నం కావ‌డంతో సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ట్యాబ్స్‌ను తానే స్వ‌యంగా పంపిణీ చేస్తాన‌ని కేటీఆర్ తెలిపారు.

Also Read: సిరిసిల్లలో రాహుల్ గాంధి బహిరంగ సభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్