Friday, September 20, 2024
HomeTrending NewsTaiwan Strait: తైవాన్ జలసంధిలో యుద్ధ మేఘాలు

Taiwan Strait: తైవాన్ జలసంధిలో యుద్ధ మేఘాలు

చైనా దుందుడుకు చర్యలతో తైవాన్ జలసంధిలో యుద్ధ మేఘాలు క‌మ్ముకున్నాయి. తైవాన్ వాయు క్షేత్రాన్ని ఈ రోజు చైనా యుద్ధ విమానాలు క‌మ్మేశాయి. డ‌జ‌న్ల కొద్ది విమానాలు.. తైవాన్‌ను విమానాల‌తో చుట్టుముట్టాయి. మిస్సైళ్ల‌ను మోసుకెళ్లిన యుద్ధ విమానాలు.. తైవాన్ ఆకాశ ప్రాంతాన్ని పూర్తిగా బ్లాక్ చేశాయి. తైవాన్ వ‌ద్ద సిములేటెడ్ స్ట్ర‌యిక్స్ నిర్వ‌హించిన‌ట్లు ఇవాళ చైనా ప్ర‌క‌ట‌న చేసింది. చైనాకు చెందిన షాన్‌డాంగ్ యుద్ద నౌక .. తైవాన్ జ‌లాల్లో సైనిక విన్యాసాలు నిర్వ‌హిస్తోంది. ఆదివారం కూడా భారీ స్థాయిలో చైనా సైనిక స‌త్తా ప్ర‌ద‌ర్శించింది. తైవాన్ దీవిలో ఉన్న ఓ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ లైవ్ డ్రిల్స్ నిర్వ‌హించారు. హెచ్‌-6కే ఫైట‌ర్ జెట్ల‌తో అటాక్ చేసిన‌ట్లు పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీకి చెందిన ఈస్ట్ర‌న్ థియేట‌ర్ క‌మాండ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయి యింగ్‌ వెన్‌ అమెరికాలో పర్య‌టించ‌డంతో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. వెన్‌ పర్యటనపై ఆగ్రహంతో ఉన్న చైనా.. శనివారం తైవాన్‌ వైపుగా ఎనిమిది యుద్ధ నౌకలు, దాదాపు 70 ఫైటర్‌ జెట్లను మోహరించింది. వీటిలో 45 ఫైటర్‌ జెట్‌లు చైనా, తైవాన్‌ను విడదీసే జలసంధిలోని మీడియన్‌ లైన్‌ను దాటి వచ్చాయని తైవాన్‌ రక్షణ శాఖ వెల్లడించింది.

మూడు రోజుల పాటు జరిగే యుద్ధ సన్నాహక విన్యాసాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయని చైనా మిలటరీ ప్రకటించింది. అదేవిధంగా తైవాన్‌కు సరిగ్గా ఎదురుగా ఉండే ఫుజియాన్‌ ప్రావిన్స్‌లోని లుయోయువాన్‌ బేలో లైవ్‌ ఫైర్‌ ట్రైనింగ్‌(సైనికులకు యుద్ధ సన్నాహక శిక్షణ) నిర్వహించాలని చైనా నేవీ నిర్ణయించింది. అవసరమైతే తైవాన్‌ను బలవంతంగానైనా తమ దేశంలో కలిపేసుకొంటామని చైనా చెబుతున్న విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్