TFJA:  తెలుగు ఫిలిం జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ (టి.ఎఫ్‌జె.) స‌భ్యులంద‌రికీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల‌ను మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధానం చేశారు. హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్‌లో జ‌రిగిన కార్యక్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌తి ఒక్క‌రికీ కార్డులు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ సినిమాటోగ్ర‌పీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి, ఎతికా ఇన్యూరెన్స్ సి.ఇ.ఓ. రాజేంద్ర, టి.ఎఫ్‌.జె. అధ్య‌క్షుడు వి లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రటరీ వై జె రాంబాబు, కోశాధికారి నాయుడు సురేంద్ర కుమార్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ  “జ‌ర్న‌లిస్టులంటే నా బంధువుల‌తో వున్న ఫీలింగ్ క‌లుగుతుంది. నా కెరీర్ ఆరంభంలో `ప్రాణం ఖ‌రీదు` సినిమా చేస్తున్న‌ప్పుడు నా గురించి ఎవ‌రైనా రాస్తే బాగుంటుంద‌ని ఆనుకుంటున్న త‌రుణంలో ప‌సుపులేటి రామారావుగారి రాసిన ఆర్టిక‌ల్ న‌న్ను ఎంతో క‌దిలించింది. వెంట‌నే ఆయ‌న‌కు థ్యాంక్స్ చెబుతూ ఏదైనా ఇవ్వాల‌ని వంద‌రూపాయ‌లు ఇస్తే, ఆయ‌న సున్నితంగా తిర‌స్క‌రిస్తూ, డ‌బ్బుకోసం రాయ‌లేదు సార్‌. అది నా బాధ్య‌త అన్న మాట‌లు జ‌ర్న‌లిస్టుల‌పై గౌర‌వాన్ని మ‌రింత పెంచాయి .అలా రామారావుగారి పై గౌర‌వం ఇటీవ‌లే మ‌ర‌ణించినంత‌వ‌ర‌కు వుంది.

అదేవిధంగా నా కెరీర్‌కు త‌గు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వ‌డ‌మేకాకుండా ఉన్న‌ది ఉన్న‌ట్లు తెలియ‌జేసిన గుడిపూడి శ్రీ‌హ‌రి, వి.ఎస్‌.ఆర్‌. ఆంజ‌నేయులు, నంద‌గోపాల్ వంటివారి నుంచి ఎన్నో విష‌యాలు తెలుసుకుంటూ న‌న్ను నేను స‌రిచేసుకునేలా చేశారు. ఈ రోజున ఆ గౌర‌వంతో టి.ఎఫ్‌.జె. క‌మిటీ ఆహ్వానిస్తే వ‌చ్చాను. పాండ‌మిక్ టైంలో 24 క్రాఫ్ట్‌ల‌తోపాటు జ‌ర్న‌లిస్టు సోద‌రుల‌కు కూడా నిత్యావ‌స‌ర స‌రుకులు అంద‌జేయ‌డం జ‌రిగింది. ఇక త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ గారి సూచ‌న మేర‌కు ప్ర‌తి సినిమాకు ల‌క్ష‌రూపాయ‌లు చొప్పున టి.ఎఫ్‌.జె. అసోసియేష‌న్‌కు ఇచ్చేలా నేను ముందుంటాను.

ఈరోజు హెల్గ్ కార్డ్‌లు నా చేతుల‌మీదు జ‌రిగాయి. భ‌విష్య‌త్‌లో ఏ అవ‌స‌రం వచ్చినా మీకు తోడుగా వుంటాను. ఇక ముఖ్య‌మైన విష‌యం ఏమంటే, రాష్ట్రం విడిపోయాక ఎటువంటి అవార్డులు సినిమారంగానికి లేవు. అందుకు టి.ఎఫ్‌.జె. న‌డుంక‌ట్టి ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌మొత్తం క‌లిపేలా సౌత్ ఇండియ‌న్ ఫిలింఫెస్టివ‌ల్ అవార్డులు న‌వంబ‌ర్‌లో ఇవ్వాల‌నుకోవ‌డం శుభ‌ప‌రిణామం.. ఇందుకు ఎల్ల‌వేల‌లా నా వంతు స‌హ‌కారం వుంటుంద‌ని అన్నారు.

Also Read : ఆచార్య’ గురించి ఏమనుకుంటున్నారు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *